Sunday, May 1, 2016

మాధవ ఆవాసం చిన్నారులకు ఆర్థికసాయం

Jyothi High School students donated 11,000 INR to Madhava Avasam
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్‌
పట్టణంలోని మాధవ ఆవాసం చిన్నారులకు జ్యోతి హైస్కూల్‌ విద్యార్థులు రూ.11 వేలు ఆర్థికసాయాన్ని సోమవారం ఆవాస నిర్వాహకులకు అందజేశారు. విద్యార్థులు సేకరించిన విరాళాలను పాఠశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ మువ్వా రామారావు, ప్రిన్సిపాల్‌ బాబా సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవాస కమిటీ సభ్యులు చెన్న శ్రీనివాస్‌, గౌరు ప్రవీణ్‌ పాల్గొన్నారు. 
Source: http://www.navatelangana.com/article/nalgonda/232013

మిర్యాలగూడ : మాధవ ఆవాసంలో సేద దీరుతున్న పేద విద్యార్థులకు స్థానిక జ్యోతి హై స్కూల్‌ మంగళవారం రూ. 11వేల ఆర్థిక సహాయాన్ని అందించిది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ మువ్వారామారావు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల విద్య, వసతి సౌకర్యాల కోసం తమ వంతు సహాయంగా అందించామని పేర్కొన్నారు. పేద విద్యార్థులు తమ అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ షేక్‌ బాబా, మాధవ ఆవాస కమీటీ సభ్యులు చెన్నా శ్రీనివాస్‌, గౌరు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.
Source: Andhra Prabha

No comments:

Post a Comment